ఓ!దేవా నాతోడుగ నీవుండుమునీవుండుము నాతోడుగ!సాయంసంధ్య అతి త్వరగా సమీపించుచున్నదిదట్టమైన చీకట్లు ముసురుచున్నట్టివేళ,నీవుండుము నాతోడుగసహకారులు కృతకృత్యులుకాని వేళ సుఖాలెల్ల చెదిరిపోయెనిస్సహాయుల సహకారీ!,నాతోడుగ నీవుండుము!జీవితంపు కురుచ దినము శరవేగంతో చేరువ అగుచున్నదీఇహిక సుఖాలన్ని కనుమరుగౌతుండగ వాటి ఘనత మాయమయ్యెమార్పు,క్షయములు ఆవరించె నేజూడమార్పులేని ఓ దేవా! నీవుండుము నాతోడుగ!క్షణిక చూపు, జారుచున్న నీమాట నేకోరనునీశిష్యులతో చనువుగ,అరమరికలు అసలులేక, ఓర్మిగ వుండు రీతిగ ఓ ప్రభు!నా తోడుగ అట్లుండుముతాత్కాలపు నీ వునికిని నేగోరను, స్థిరముగ నుండుము నాతోరారాజుకు వలెను భయానకము కల్పించక రమ్ము నీవు,కరుణతొ మంచితనము మేళవించి నయమునున్న నీరెక్కలూందరి కోర్కెలు మన్నించే సద్~ హృదయముతో ఛేదించును బాధలెల్లపాపాత్ముల స్నేహితుడా! రమ్ము! నాతోడుగ నివసించుము తొలి యౌవనమున నను నవ్వించిన నీవుతలబిరుసుగ తిరుగుబాటు పెల్లుబకగ నడచిననాడైన, నిన్ను నేను విడిచినైన, నువ్వు నన్ను వీడలేదు.చివర వరకు ఓ! ప్రభూ!నాతోనే వుండుమాగడుచుచున్న ప్రతి క్షణమునే కోరెద నీ యునికినిదుష్ట శక్తులనణచ నీకృప యొక్కటియె చాలునిను బోలు మార్గదర్శకుడు ఇంకెవడుగలడు నాకు?వెలుగు,చీకట్లలో నాతోడుగానుండు నీవునాదరినువుజేరి ఆశీస్సులు అందజేయ శత్రుభయమె లేదు నాకుకష్టములు భారము కానే కావు, కన్నీరు కఠినమసలు కాదులే మృత్యువు కాటు వెయ్యకానరాదు శ్మశానమా నీ విజయమెచటగలదు?నీవు నాతోడనుండ జయోత్సాహినై మెలగెద నందాకమూసుకుంటున్న నా కనుల ముందు నీసుదర్శనం నిలుపుమాఅంధకారమునుండి చెప్పుచు ఆకసమును చూపునాకుస్వర్గం వుదయం తెరిచింది, వ్యర్ధమైన భూ చాయలులు మాయమయ్యెబ్రతుకులోను చావులోను ఓ ప్రభూ నాతోడుగ నీవుండుమ
విధేయుడు
జాబాలిముని.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment